
మండల కేంద్రంలో ని రెంజల్ కెనాల్ సమీపంలో, రెంజల్ కమాన్ సమీపంలో, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఎదురుగా వేసిన చెత్తాచెదారం దుర్గంధం గ మారడంతో, రెంజల్ గ్రామ కార్యదర్శి రాజేందర్ రావు వెంటనే స్పందిస్తూ పారిశుద్ధ్య కార్మికులతో అట్టి దుర్గంధ స్థలాలలో నున్న చెత్తాచెదారాన్ని ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్ కు తరలించారు. ఇకనుంచి ఆయా స్థలాలలో డస్ట్ బిన్ ఏర్పాటు చేసుకుంటే తమ సిబ్బంది వాటిని రెండు రోజులకోసారి డంపింగ్ యార్డ్ కు తరలిస్తారని ఆయన కోరారు. చెత్తాచెదారం దరిచరినట్లయితే కుక్కలు స్వైర విహారం చేస్తూ ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందని, ఇకనుంచి డస్ట్ బిన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు.