మండలంలోని పొట్టపెల్లి (ఎం) నుంచి హద్గాం వెళ్ళే రోడ్డు పెరిగిన పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలను పొట్టపెల్లి గ్రామానికి చెందిన జాదవ్ శివకాంత్ శనివారం జేసీబీ ఏర్పాటు చేసి వాటిని తొలగించారు. వర్షపు జల్లులకు పొదలు ఏపుగా పెరగడంతో ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇది గమనించిన యువకుడు ముందుకొచ్చి తన సొంత ఖర్చులతో పొదలను తొలగించి సమస్యను పరిష్కరించాడు. ఈ క్రమంలో ఇరు గ్రామాల ప్రజలు ఆయనను అభినందించారు.