ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ముళ్ళ పొదల తొలగింపు 

– మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి చెరువు కట్టపై ఉన్న ముళ్ల పోదలను  మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ ఆదేశాల మేరకు గురువారం తొలగిస్తున్నట్లు మాజీ వైస్ ఎంపీపీ జల్ల వెంకటేష్ మాజీ సర్పంచ్ పెరుమాండ్ల మల్లేశం తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రాహ్మణ కొత్త పల్లి చెరువు కట్టపై మీరు ప్రక్కల విపరీతంగా ముళ్లపదలు నిండి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని మరియు మూలమలుపుల కాడ వచ్చిపోయే వాహనాలు కూడా కనిపించకుండా ప్రమాదo నెలకొన్నదని ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ కు విన్నపం చేశామని వెంటనే స్పందించి ఎమ్మెల్యే ముళ్ళపదలు తొలగించమని ఆదేశాలు జారీ చేశారని అన్నారు దీనితో వెంటనే గ్రామానికి  చెందిన చెరువు కట్టపై ఉన్న ఇరు ప్రక్కల ముళ్లపదలను తొలగిస్తున్నట్లు తెలిపారు దీంతో గ్రామ ప్రజలు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ సతీష్ అక్బర్ మధు ఉన్నారు