పట్టణంలోని రెండవ వార్డులో ముళ్ళ పొదల తొలగింపు

Removal of thorn bushes in the second ward of the townనవతెలంగాణ – ఆర్మూర్ 
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రజా రంజక పాలన అందిస్తున్న తెలంగాణ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వములో పేద ప్రజల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ, సం. కాలములో నిరుద్యోగులకు దాదాపు 50 వేల పైచిలుకు ఉద్యోగాలు కల్పించి, రైతులకు దాదాపు 25 వేల కోట్ల రూపాయలతో ఒక్కొక్కరికి దాదాపు రెండు లక్షల వరకు రుణ మాఫీతో చరిత్ర సృష్టించినారని ప్రముఖ న్యాయవాది, రెండవ వార్డ్ కౌన్సిలర్ కాందేశ్ సంగీత గురువారం తెలిపారు. గురువారం మాట్లాడుతూ డీఎస్సీ ద్వారా వేల టీచర్ ఉద్యోగాలు కల్పించి, మహిళామణులకు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజాపాలన విజయవంతంగా కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతున్న సందర్బములో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా  నియోజకవర్గ ఇంచార్జ్ వినయ్ రెడ్డి ఆదేశానుసారం  పట్టణములోని రెండవ వార్డులో  మున్సిపల్ బ్లేడ్ ట్రాక్టర్ తో ముళ్ల పొదలను తొలగించడం జరిగింది, మున్సిపల్ సిబ్బంది వీధులను శుభ్రం చేసారు. ఈ కార్యక్రమములో సానిటరీ అధికారి గజానంద్, వార్డు ప్రత్యేక అధికారి సలీం, కాంగ్రెస్ నాయకులు ఖాందేష్ సత్యం, నరేశ్ మున్సిపల్ సిబ్బంది దొండి రమేష్, నర్సయ్య, పోశన్న తదితరులు పాల్గొన్నారు.