అనుమతుల్లేని ప్రచార అస్త్రాల తొలగింపు..

నవతెలంగాణ-బెజ్జంకి :
ఎన్నికల అధికారుల అనుమతుల్లేకుండా పలువురి నివాస గృహల గోడలపై అయా రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రచార్థాం వినియోగించిన ప్రచార అస్త్రాలను శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుల్లో ఉండడంతో సంబంధిత ఎన్నికల అధికారి అనుమతుల మేరకే అయా పార్టీల ప్రచార అస్త్రాలు వినియోగించాలని అనుమతుల్లేని సంబధిత గృహ యాజమానులపై చట్టపరమైన చర్యలు చేపడుతామని పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి తెలిపారు.