
హరితహారంలో భాగంగా మొక్కల పెంపకాన్ని చేపడుతున్న అధికారులు ఎవెన్యూప్లాంటేషన్‌లో విద్యుత్ తీగల కింద మొక్కల్ని నాటుతుండడం విద్యుత్ అధికారులకు సమస్యగా మారుతున్నది. ఉమ్మడి బీర్కూర్, నసురుల్లాబాద్ మండలంలో 9 విడుతల్లో హరితహారంన్ని చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మొక్కల పెంపకానికి నిర్దేశిత లక్ష్యం ఏర్పాటు చేయడంతో, విధిలేని పరిస్థితుల్లో అనాలోచితంగా ఎవనెన్యూప్లాంటేషన్‌లో రోడ్డుకిరువైపులా విద్యుత్ తీగల కింద మొక్కల్ని నాటి అధికారులు చేతులు దులుపుకున్నారు. మొక్కలు వృక్షాలుగా మారి విద్యుత్ తీగలకు కొమ్మలు తగులుతుండడంతో గాలిదుమారం వీచినప్పుడు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాన్ని కలిగిస్తున్నాయి. నసురుల్లాబాద్ నుంచి లింగంపల్లి వెళ్లే రహదారిపై ఉన్న మొక్కలను తొలగించారు. బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా నుంచి బీర్కూర్ వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న హరితహారం మొక్కలను పెంపకాన్ని చేపట్టారు. గత వారం రోజులుగా ఈదురు గాలులు వర్షం రావడంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతూ, విద్యుత్ అధికారులకు పెద్ద సమస్యగా మారడంతో చెట్ల కొమ్మల్ని తొలగిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో విద్యుత్ తీగల కింద ఉన్న చెట్లను, కొమ్మల్ని తొలగిస్తుండడంతో హరితహారంలో నాటిన మొక్కలు కనుమరుగవుతున్నాయి. వర్షాకాలానికి ముందే విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెక్ పెట్టేందుకు, విద్యుత్ తీగల స్థానంలో కవర్ కండక్టర్ విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే వర్షాకాలంతో పాటు గాలిదుమారమప్పుడు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండి, ప్రజాదనం దుర్వినియోగమయ్యేది కాదని స్థానికులు అంటున్నారు. ఆ దిశలో విద్యుత్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు మొక్కలు నాటేముందు తగు జాగ్రత్తలు తీసుకుని మొక్కలు నాటాలని ప్రజలు విన్నవిస్తున్