నవతెలంగాణ- కొండపాక
గ్రామం నడిబొడ్డులో ఉన్న రైస్ మిల్లును తొలగించాలని ప్రజావాణిలో గ్రామస్థులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కొండపాక మండల పరిధిలోని బందారం గ్రామంలో నడిబొడ్డున గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న రైస్ మిల్లు వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల రైస్ మిల్లును మరింత అభివద్ధి చేయడ తో దాని నుండి వెలువడే దుమ్ము ధూళి ఇండ్లలో పడి ప్రాణాంతక వ్యాధులతో పాటు ఉబ్బసం వంటి వ్యాధులకు గురైతునట్లు తెలిపారు . రైస్ మిల్ నుండి వచ్చే కాలుష్యంతో నివసించడానికి వీలు లేక ఇండ్లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పదుతుందన్నారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విన్నవించామన్నారు . అనేక సార్లు ప్రజావాణిలో వినతి పత్రం అందజేసినా అధికారులు స్పందించలేదన్నారు. ఈ కార్యక్రమంలో బందారం గ్రామస్తులు మల్లారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మల్లేశ , మాజీ ఉప సర్పంచ్ వెంకట్, పలువురు పాల్గొన్నారు.