బీజేపీలో బీసీ అధ్యక్షుని తీసేయడం బీసీలపట్ల చిన్న చూపే

– బీసీ నాయకునికే పార్టీ పగ్గాలు అప్పగించాలి
– ఒకే సామాజివర్గానికి ఇన్ని పదవులా
– జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్‌ కుమార్‌ కందుకూరి
నవతెలంగాణ-తాండూరు
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు ని తొలగించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కిషన్‌ రెడ్డిని నియమించడంపై జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు తాండూర్‌ నియోజవర్గ బీసీ సంఘం కన్వీనర్‌ రాజ్‌ కుమార్‌ కందుకూరి తీవ్రంగా విమర్శించారు. బీజేపీ జాతీయ నాయకత్వాన్ని తప్పు పట్టారు. బీసీ నాయకుడైన బండి సంజరుని బలవంతం గా రాజీనామా చేయించి అగ్ర కులాలకు చెందిన కిషన్‌రెడ్డికి తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించడంపై రాజ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతకాలంగా బీజేపీ బలోపేతానికి కృషిచేసిన ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుని తొలగించడం బీసీలను విస్మరించడమేనని బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బండి సంజరు నాయకత్వాన్ని కొనసా గించాలని లేనిచో బడుగు వర్గాలకు చెందిన నాయకులు ఈటల రాజేందర్‌ ధర్మపురి అరవింద్‌ స్వయ బాబురావు నియమించాలని డిమాండ్‌ చేశారు. వెంటనే కిషన్‌ రెడ్డిని తొలగించాలన్నారు. బండి సంజరు ప్రజాదారణ పెరుగుతుందని కొంతమంది బీసీ సామాజికవర్గ నాయకుని ఎదుగుదల చూడలేక పనిగట్టుకొని బీసీ నాయకునిపై నిందలు వేశారన్నారు.