ప్రముఖ సామాజిక సేవాకారుడు, ఎన్నారై బల్ల ఆంజనేయులు జన్మదిన ఫ్లెక్సీలు మున్సిపల్ అధికారులు తొలగించడం దారుణమని ఎన్నారై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ భవనంలో ఎన్నారై అభిమానులు మీడియాతో మాట్లాడారు. శనివారం బల్ల ఆంజనేయులు జన్మదినం సందర్బంగా కామారెడ్డి పట్టణంలో రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా ఏర్పాటు చేశామన్నారు. అయితే పట్టణంలో అనేక ఫ్లెక్సీలు ఉండగా కేవలం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే వ్యక్తికి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రమే తొలగించడం సరికాదన్నారు. ఈ విషయమై కమిషనర్ ను అడగడానికి వెళ్లగా ఆమె సెలవులో ఉండటంతో టిపిఎస్ ను అడిగితే నిర్లక్ష్యంగా సమదానమిచ్చారన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అడిషనల్ కలెక్టర్ ఆదేశాలతో తొలగించామని టిపిఎస్ చెప్తున్నారని, దానికి సంబంధించి లెటర్ ఇవ్వాలని అడిగితే సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారని తెలిపారు. తాను సంపాదించే దాంట్లో కొంత సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్న ఎన్నారై ఫ్లెక్సీలలో ఏ నాయకుడి ఫోటో కూడా పెట్టలేదని స్పష్టం చేశారు. ఫ్లెక్సీల తొలగుంపు వెనక ఉన్నదెవరని ప్రశ్నించారు. రాజకీయాలకు తావు లేకుండా ఓ ఎన్నారై జన్మదిన సెలబ్రేషన్ కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం అన్యాయమని, ఇలాంటివి మరోసారి జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామల శీలా సాగర్, బంధం వేణుగోపాల్, గుర్రాల రవి, నాగళ్ల రాజేందర్, మేకల మహేష్, రంగ అంజాగౌడ్, జింక భాస్కర్, పిట్ల సింహం, సుమన్ చారీ, రవి, అజయ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.