– ప్రతి కార్యకర్త కడుపులో పెట్టుకొని కాపాడండి .
– బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్
నవ తెలంగాణ- రెంజల్:
నవ తెలంగాణ- రెంజల్:
గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ ఫలాలను అందించిన ఘనత కెసిఆర్ కే దక్కిందని బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ స్పష్టం చేశారు. శుక్రవారం రెంజల్ మండలంలోని సానియా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ ఫలాలతో పాటు, తన కుటుంబం ట్రస్ట్ వెల్ఫేర్ ద్వారా నిరుపేదలకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని అన్నారు. బోధన్ నియోజకవర్గం ప్రజలు తనను కడుపులో పెట్టుకొని, తిరిగి మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. రెంజల్ మండలంలో 17 గ్రామ పంచాయతీల పరిధిలోని యువత, మహిళలు అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కండువను కప్పుకున్నారని ఆయన పేర్కొన్నారు. గత 70 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధినీ, కేవలం 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిందని ఆయన పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాలతో పాటు, రైతులకు రైతుబంధు, రైతు బీమా, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఒంటరి మహిళలకు పింఛన్లు, అందించిన ఘనత సీఎం కేసీఆర్ కేదకిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 400 రూపాయలకే సిలిండర్, సౌభాగ్యలక్ష్మి కింద మహిళలకు నెలకు 3000, రైతుబంధు పదివేల నుంచి 16,000, అన్నపూర్ణ పథకం కింద సన్న బియ్యం, వికలాంగులకు 6000 పింఛన్, అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భూమారెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు వికార్ పాషా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రఫీ క్, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షులు కాశం సాయిలు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు ఎమ్మెస్ రమేష్ కుమార్, గంగాధర్ గౌడ్, బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు హాజీ ఖాన్, ఎంపీటీసీలు అస్సాద్ బేగ్ ఎస్.కె అహమ్మద్, సర్పంచులు మీర్జా కలీం బేగ్, పాముల సాయిలు, జాదవ్ గణేష్ నాయక్, స్థానిక నాయకులు రాఘవేందర్, నరసయ్య, సాయి రెడ్డి, బాబు నాయక్, కృష్ణారావు, ఫారూఖ్ పటేల్, గోపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.