రెంజల్ మండలం వడ్డెర సంఘం ఏకగ్రీవంగా ఎంపిక

నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలంలోని వడ్డెర సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగిందని వడ్డెర సంఘం మండల అధ్యక్షులు ఏ.సాయిలు పేర్కొన్నారు. పెంజల మండల వడ్డెర సంఘం అధ్యక్షులుగా ఏ.సాయిలు, ప్రధాన కార్యదర్శిగా ఈశ్వర్, ఉపాధ్యక్షులుగా రంగయ్య, కందిగంగ స్వామి, కోశాధికారిగా రాజన్, సంయుక్త కార్యదర్శిగా శేఖర్, ఆర్గనైజర్ గా బాబు, ముఖ్య సలహాదారులుగా హనుమంతు, గంగారెడ్డి, చిన్న సాయిలు, లక్ష్మణ్, సాయిలు, ఎం. సాయిలు తదితరులు ఉన్నారు.