ప్రముఖ సాహితీవేత్త కూరెళ్ళ విఠలాచార్యకు “పద్మశ్రీ” జిల్లాకు గర్వకారణం. 

ఎండి జహంగీర్ (సీపీఎం జిల్లా కార్యదర్శి)
నవతెలంగాణ – భువనగిరి
తెలుగు సాహితీరంగంలో నూతన ఆవిష్కరణలు విశేష సేవలందిస్తూ నేటి రాబోవు తరానికి మార్గదర్శకంగా ఉన్న ప్రముఖ సాహితీవేత్త రచయిత కూరెళ్ల విఠలాచార్య కి పద్మశ్రీ పురస్కారం, భువనగిరి మండలం ఆకుతోట బావికి చెందిన కేతావత్ సోమల నాయక్ భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించడం తో వారికి కూడా పద్మశ్రీ పురస్కారం రావడం జిల్లాకు గర్వకారణం అని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఇంటిని గ్రంథాలయంగా మార్చి లక్షలాది విలువైన పుస్తకాలు సమకూర్చి అనేకమంది విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడే విధంగా గ్రంథాలయాన్ని తీర్చిదిద్దడం గొప్ప విషయమన్నారు. నేటి సమాజానికి దారి చూపే గ్రంథాలను అందించారని ప్రశంసించారు. కేతావత్ సోమ్లా నాయక్ భువనగిరిలో చదువుకొని తెలుగులో ఉన్న భగవద్గీతను బంజారా భాషలోకి అనువదించడం అభినందనీయం అన్నారు. అత్యంత వెనుకబడిన సామాజిక వర్గాలకు అర్థమయ్యే రీతిలో పుస్తకాన్ని అనువదించడం గొప్ప విషయం అని సిపిఎం జిల్లా కమిటీ తరఫున కూరెళ్ళ విఠలాచార్య కి సోమ్లా నాయక్ అభినందనలు తెలిపారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు, మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దాసరి పాండు, మేక అశోక్ రెడ్డి ఉన్నారు.
మతోన్మాదం పేరుతో రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న . ఎండి జహంగీర్ (సీపీఎం జిల్లా కార్యదర్శి)
దేశంలో బిజెపి ప్రభుత్వం మతోన్మాదం ముసుగులో రాజ్యాంగ విలువలను కాలరాస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయంలో త్రివర్ణ పథకాన్ని ఎగరేసి అనంతరం వారు మాట్లాడుతూ సర్వ మతాలకు నిలయమైన భారతదేశాన్ని కులాల పేరుతో మతాల పేరుతో విభజించి ప్రజల మధ్యన చీలికలు తీసుకొచ్చి వైశమ్యాలను రెచ్చగొడుతున్నారన్నారు. భారత రాజ్యాంగంలో ఉన్న అంశాలను మారుస్తూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక చట్టాలను సవరిస్తూ అనేక రకాల మార్పులు చేయాలని బిజెపి ప్రభుత్వం చూస్తుందన్నారు. దీనిమీద ప్రజలు కార్మికులు యువకులు విద్యార్థులు మేధావులు పోరాటాలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు, కల్లూరు మల్లేశం, దాసరి  పాండు, నాయకులు మాయ కృష్ణ, ప్రజా సంఘాల నాయకులు గడ్డం వెంకటేష్, వనం రాజు, ఈర్లపల్లి ముత్యాలు, బోడ భాగ్య, వడ్డబోయిన వెంకటేష్, లావుడ్య రాజు, బోడ హనుమంతు, మాటూరు సుశాంత్ గౌడ్, గడ్డం చాణిక్య పాల్గొన్నారు.
సీసీఐ(ఎం) కార్యాలయంలో..
 జిల్లా సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు వేషాల అశోక్ ఎండి ఇమ్రాన్ శోభన్ బాబు ఘనబోయిన వెంకటేష్ పాల్గొన్నారు.
ఏఐటిసి ఆధ్వర్యంలో..
స్థానిక బస్టాండ్ వద్ద జాతీయ పతాకాన్ని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండి ఇమ్రాన్ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు ఘనబోయిన వెంకటేష్ శోభన్ బాబు పాల్గొన్నారు.
జిల్లాకు రెండు పద్మశ్రీ పురస్కారాలు, ఆనందం వ్యక్తం చేసిన జిల్లావాసులు
యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్న పేటకు చెందిన ప్రముఖ సాహితీవేత కూరెళ్ళ విఠలాచార్యకు సాహితీ సేవలో రాణించినందుకు తన ఇల్లుని గ్రంథాలయంగా మార్చి పద్మశ్రీ పురస్కారం రావడం అదేవిధంగా. భువనగిరి   మండలం ఆకుతోట బావి తండాకు చెందిన కేతావత్ సోమల నాయక్ భగవద్గీతను బంజారా భాషలోకి అనువాదాన్ని చేసినందుకు పద్మశ్రీ పురస్కారాలు ఇరువురు అందుకున్నందుకు పలువురు వారికి అభినందనలు తెలియజేశారు . సోమ్లా నాయక్ భగవద్గీత 71 శ్లోకాలను బంజారా భాష లోకి అనువదించారు. 2014లో భగవద్గీతను వాదాన్ని టిటిడి ప్రచురించింది. ఒకే సంవత్సరం ఒకే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులకు పద్మశ్రీ రావడం పట్ల పలువురు వారిని అభినందించి సంతోషం వ్యక్తపరిచారు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ ప్రస్తుత విద్యార్థులు అధ్యాపక బృందం వారికి అభినందనలు తెలిపారు. కేతావత్ సోమ్ల నాయక్ ఇదే కళాశాలలో చదవడం వారికి పద్మశ్రీ రావడం గర్వంగా ఉందని వారు పేర్కొన్నారు. వై ఎల్ ఎస్ బ్యాంక్ చైర్మన్ మందాడి వెంకటరెడ్డి వైస్ చైర్మన్ కొలుపుల వివేకానంద తో పాటు డైరెక్టర్లు చల్లగురుగుల రఘుబాబు, సోమ రాజిరెడ్డి, నువ్వుల సుధాకర్, మంచాల ప్రభాకర్, మంచి కంటి రవి వారికి అభినందనలు తెలిపారు.