మంచి కాన్సెప్ట్‌తో రెంట్‌

Rent with good conceptజెఎంఎం జాగతి మూవీ మేకర్స్‌ పతాకంపై శివారెడ్డి, జాష్ణిని, వనిత రెడ్డి హీరో, హీరోయిన్లుగా రఘువర్ధన్‌రెడ్డి దర్శకుడిగా బలగం జగదీష్‌ నిర్మించిన చిత్రం రెంట్‌. ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రం ఈనెల 25న విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ప్రసాద్‌ ల్యాబ్‌లో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా హీరో శివారెడ్డి మాట్లాడుతూ, ‘ఇదొక మంచి థ్రిల్లింగ్‌ కథ, మంచి కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఉన్నాయి. అలాగే మంచి మెసేజ్‌ కూడా ఉంది. ఈ సినిమా యూత్‌తో పాటు అందరికీ బాగా నచ్చుతుంది’ అని అన్నారు.
‘ఈ చిత్రంలో నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది’ అని నటుడు అమిత్‌ చెప్పారు. హీరోయిన్‌ జాష్ణిని మాట్లాడుతూ, ‘నేను ఈ సినిమాలో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో విడుదల అవుతున్న నా మొదటి సినిమా’ అని తెలిపారు. ‘నాకు మంచి క్యారెక్టర్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్‌. అందరూ థియేటర్‌కి వచ్చి మా సినిమాకి మంచి విజయం అందిస్తారని ఆశిస్తున్నాను’ అని మరో హీరోయిన్‌ వనిత రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: వల్లి, సంగీతం : డి ఎస్‌ ఆర్‌ బాలాజీ.