– రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్టే ట్రేడ్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షలు ఎం. నరేష్
నవతెలంగాణ-సిటీబ్యూరో
పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి 15రోజులు కావొస్తున్నా అద్దెకు తీసుకున్న మోటారుక్యాబ్ వాహనాల డబ్బులు రవాణాశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు చెల్లించ లేదని, కావున డబ్బులు వెంటనే చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్టే ట్రేడ్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షలు ఎం. నరేష్, నాయకులు సోమాజి, హరికష్ణ డిమాండ్ చేశారు. రవాణా శాఖ జాయింట్ కమీషనర్‌కు శనివారం వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బులు చెల్లించక పోవడంతో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. 15 రోజులు గా డబ్బులు చెల్లించాలని అడిగితె స్పందించకపోవడంతో కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్టు తెలిపారు. అద్దెకు తీసుకున్న వాహనాలకు డబ్బులు చెల్లించాలని, అవసరం అయితే ఎలక్షన్ కమిషనర్‌ను కలిసి చెబుతామన్నారు. ముఖ్యంగా అంబర్‌పేట, మలక్‌పేట, కొండాపూర్ రవాణాశాఖ కార్యాల యాల్లో అద్దె డబ్బులు ఇవ్వలేదని తెలిపారు డబ్బులు ఇవ్వని పరిస్థితిలో డ్రైవర్లు రోడ్లమీదకు వచ్చి పోరాటం చేస్తారని హెచ్చరించారు. జీఓ ఎంఎస్ నెం 166 ప్రకారం.. ప్రతీ 10 కిలోమీటర్లకు 1 లీటర్ చొప్పున ఇంధనం ఇవ్వాల్సిందని, కానీ ఇవ్వక ఇబ్బందులకు గురి చేశారని చెప్పారు. కనీస పని గంటలు 8 కంటే కూడా అధికంగా 16గంటలు పని చేయించుకున్నారని కావున అధిక పని గంటలకు కూడా గంటకు రూ. 250 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు.