
నవతెలంగాణ-అశ్వారావుపేట : ఎంపీ(రాజ్యసభ సభ్యురాలు) రేణుక చౌదరి జన్మదిన వేడుకలను మంగళవారం కాంగ్రెస్ పూర్వ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.పార్టీ సీనియర్ నాయకులు మొగళ్ళపు చెన్నకేశవరావు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి లు మాట్లాడుతూ ఖమ్మం ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందడంలో ఆమె పాత్ర మరువలేనిదని ప్రశంసించారు.ఈ సందర్భంగా సామాజిక ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ పూర్వ కో – ఆప్షన్ సభ్యులు ఎస్.కే పాషా,నాయకులు సత్యవరపు బాల గంగాధర్,చిమటబోయిన సత్యనారాయణ,కోడూరి శ్రీను, సురేష్,అనిల్ కృష్ణ, గుజ్జు వెంకటేశ్వరావు,ముళ్ల గిరి మోహన్ రావు,మణి రాజు,ఏసు కార్యకర్తలు పాల్గొన్నారు.