నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం వీరన్న గుట్ట గ్రామంలో మంగళవారం రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలను గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌడశెట్టిలు, బైండ్ల వారితో సాంప్రదాయమైన పద్ధతుల్లో గౌడ సంఘం ఈ పండుగ వేడుకలు నిర్వహించారు. మహిళలు ప్రతి ఇంటి నుంచి బోనాల ఎత్తుకొని గ్రామంలోని ప్రధాన వీధుల ఊరేగింపుగా ఆలయ ప్రాంగణంలో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.