ఘనంగా రేణుక ఎల్లమ్మ తల్లి బోనాలు

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల పరిధిలోని కన్నాపూర్,  ధర్మారం  గ్రామలలో గ్రామ దేవత అయిన రేణుక  ఎల్లమ్మ తల్లి బోనాలు మంగళవారం ఘనంగా  నిర్వహించారు. గ్రామంలో  ఐదు సంవత్సరాలకు జరిగే ఎల్లమ్మ తల్లి జాతర సందర్భంగా గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఎల్లమ్మ బోనంతో,మహిళలు ఒక్క పొద్దులు ఉండి అందంగా అలంకరించిన ఎల్లమ్మ తల్లి బోనాలను ఊరేగింపుగా తీసుక వచ్చి ఆలయం చుట్టూ తిప్పి బోనాలలొ చేసిన  నైవేద్యాలు సమర్పించి, ఘనంగా మొక్కలు చెల్లించుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు గ్రామస్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.