
శశనియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లోని ఆయా వ్వవసాయ చేనులకు వేళ్ళే రొడ్డులను బాగు చేయాలని ముధోల్ గ్రామా బిజేపి నాయకులు సప్పటోల్ల పోతన్న ఆదివారం ఒక్క ప్రకటనలో డిమాండ్ చేశారు. ముధోల్ జాతీయ రహదారి నుండి రువ్వి వైపుకు వేళ్ళే వ్వవసాయ రోడ్డు అద్వానంగా తయారైంది అని దీంతో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని తెలిపారు. పండించిన పంటలను రైతులు ఇంటికి తెచ్చుకోవడానికి, రోడ్డు సరిగ్గా లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని పేర్కొన్నారు. ఈ రోడ్డు కుండా వందలాది వ్యవసాయ భూమి ఉందన్నారు.రువ్వి గ్రామానికి వెళ్లడానికి కూడా ముధోల్ నుండి దగ్గరగా ఉంటుందని చెప్పారు. రోడ్డు బాగు చేయాలని అధికారులకు చెప్పిన పట్టించుకోవడంలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వ్వవసాయ రోడ్డు ను బాగు చేయాలని ఆ ప్రకటనలో కోరారు.