పోలింగ్ కేంద్రాల్లో మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలి..

– పోలింగ్ కేంద్రాల గోడలు పై ఓటరు జాబితాను అతికించండి..
– ఈ వీ ఎం స్ట్రాంగ్ రూం ను తనిఖీ చేసిన ఎన్నికల అధికారి,కలెక్టర్ గౌతం..
నవతెలంగాణ – అశ్వారావుపేట
అమ్మ ఆదర్శ పాఠశాలలకు ఎంపికై అభివృద్ది ప్రారంభించిన పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గం ఎన్నికల అధికారి,ఖమ్మం కలెక్టర్ వి.పి గౌతం ఆదేశించారు. లోకసభ సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన  అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన అశ్వారావుపేట సెగ్మెంట్ ఇవి ఎం భద్రపరిచిన స్ట్రాంగ్ రూం, కమీషనింగ్ రూం, డిస్ట్రిబ్యూషన్ స్థలాన్ని పరిశీలించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ .సంజయ్ జీ.కోల్టె తో కలిసి ఆయన అంతరాష్ట్ర సెక్ పోస్ట్ లు,పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లు,పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు పై డీఈఓ వెంకటేశ్వరా చారీ కి సూచించారు.పోలింగ్ కేంద్రాల గోడలు పై ఓటరు జాబితాను అతికించాలని అన్నారు.ఆయన వెంట తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.