
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామంలోని ఎస్సీ కాలనీ యందు నెలకొన్న నీటి సమస్యపై’ముత్తన్నపేట నూతన ఎస్సీ కాలనీలో తాగునీటి కటకట’అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రిక కథనం గురువారం ప్రచురితమైంది. నవతెలంగాణ కథనానికి తక్షణమే స్పందించిన సర్పంచ్ కనగండ్ల రాజేశం,పంచాయతీ కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించి పంచాయతీ సిబ్బందితో బోరుబావి మోటార్ పంపు సెట్ యందు తలెత్తిన సాంకేతిక లోపానికి మరమ్మతులు చేయించారు.తక్షణమే స్పందించిన సర్పంచ్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలుపుతూ నూతన ఎస్సీ కాలనీలో నీటి కటకటకు తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం త్వరితగతిన నూతన మిషన్ భగీరథ పైపు లైన్ నిర్మాణం చేపట్టి ప్రభుత్వం చెబుతున్న ప్రకారం ఇంటింటా తాగునీరందించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు.