ఎమ్మెల్యే చొరవతో రోడ్డుకు మరమ్మత్తులు

Repairs to the road at the initiative of the MLAనవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని విట్టోలి తాండ నుండి ఆష్ట  వెళ్లే రోడ్డుపై గుంతలు ఉండటంతో వాహన దారులకు, ప్రయాణికులకు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వెంటనే రోడ్డు భవనల శాఖ అధికారులతో మాట్లాడారు. రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో బుధవారం రోజు ఈ రోడ్డుకు రోడ్డు భవనల శాఖ అధికారులు మరమ్మతుల పనులు చేపట్టారు.  ఎమ్మెల్యే చొరవతో రోడ్డు బాగు చేస్తుండటంతో  ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరి వేంట యువ నాయకుడు సతీష్ రేడ్డి ఉన్నారు.