ఆన్‌లైన్‌ గేమింగ్‌పై రిపీట్‌ టాక్సేషన్‌

– పరిశ్రమ వర్గాల ఆందోళన
హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28 శాతం పన్ను విధించడం సహేతుకం కాదని ఆ రంగం పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిపాదించిన దానిలో రిపీట్‌ టాక్సేషన్‌ పద్దతి ఉందని తెలిపింది. ఆగస్ట్‌ 2న జిఎస్‌టి కౌన్సిల్‌ భేటీ అయ్యే అవకాశం ఉన్నందున తమ ఆందోళనలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. ప్రతీ గేమ్‌పై పన్ను విధించడం ద్వారా పరిశ్రమ బలహీనపడే అవకాశం ఉందని, ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రిపీట్‌ టాక్సేషన్‌ వల్ల 50-70 శాతం వరకు పన్ను పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఆన్‌లైన్‌ స్కిల్‌ గేమింగ్‌ పూర్తి విలువపై 28 శాతం జిఎస్‌టి అనేది పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.