”విరిగిన మెడ ఎముక
కళ్లల్లో గుచ్చుకుని కారిన రక్తం,
రెండు కాళ్లు 90డిగ్రీలు అటు ఇటు విరిచేయడం,
పెల్విక్ బోన్ విరిగిపోయింది,
శరీరమంతా నల్లటి మచ్చలు,
ప్రైవేట్ పార్ట్ నుండి రక్తధార,
శరీరంలో బహుళ వ్యక్తుల 150 గ్రా.ల వీర్యం” ఇది ప్రాథమిక నివేదిక. అతి కిరాతకంగా చంపివేయబడిన 31 ఏండ్ల ట్రెయినీ డాక్టర్ పోస్టుమార్టం రిపోర్టు. 78వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలోనే వచ్చిన నివేదిక ఇది. జంతువుల కన్నా మనుషులు ఎంత ప్రమాదకరమైన వాళ్లోనని భయంతో గుండె వణికిపోతున్న నివేదిక. ఇది డాక్టర్ల సమస్య మాత్రమే కాదు. మానవ మాత్రులమైన ందరి సమస్య. బిడ్డ గొప్పగా చదువుకుంటోందని ఎం.బి.బి.ఎస్ ఉత్తీర్ణురాలై, పి.జీలో సీటుకొట్టి రెండో సంవత్సరంలో ఉండగా, ప్రభుత్వ సూచనల, కళాశాల నిబంధనలకు అనుగుణంగా ఆ రాత్రికి 36 గంటలు సేవలందించిన ట్రెయినీ డాక్టరమ్మ. అలసిపోయి ఆసుపత్రిలోనే నిదురపోతున్న వేళ, అమానుషం స్వేచ్ఛగా విలయతాండవం చేసింది. అత్యాచారం, హత్య జరిగిపోయింది. ఇది సాధారణ హత్య కాదు, అత్యంత దారుణంగా చిత్రవధకు గురిచేసి చేసిన హత్య. మృగాలకూ ఓ పరిమితి ఉంటుంది. ఈ మానవ మృగానిది ఊహించని క్రూరత్వం, మనుషులు ఇంత ఆటవికంగానూ ప్రవర్తిస్తారా! నివేదిక ఇంకా చదివితే నిదురపట్టడం లేదు. ఇదే ఘటన మన ఇంట్లో జరిగితే? జరగదనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఎలాంటి మానసిక ఆలోచనలను ప్రేరేపిస్తున్నది ఈ సమాజం! విశ్వకవి రవీంద్రుని నేలలోనేనా జరిగింది! ఈశ్వరచంద్రుని, సుభాష్‌చంద్రుని కన్న భూమి లోనే ఎంత అమానవీయ ఘటన చోటు చేసుకున్నది!
ఘటన ఒక ఎత్తు. అది జరిగిన తర్వాత, మనుషులమని చెప్పుకుంటున్న మిగతావాళ్లు చేసిం దేమిటి? చనిపోయిన డాక్టరమ్మ తల్లిదండ్రులకు, ‘మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నదని’ ఆసుపత్రి వర్గాలు కబురు పెట్టాయి. వారిని ఆసుపత్రికి పిలిపించి మూడు గంటలు కూర్చోపెట్టడం ఎంత దుర్మార్గం! తల్లిదండ్రుల గుండెలు ఎంత విలపించిపోయాయో ఊహించుకోవటమే! వాళ్లు అరచి ఏడుస్తుంటే తప్ప విచారణ దిశగా కదలని ఆసుపత్రి, కళాశాల యాజమాన్యాన్ని ఏమనుకోవాలి! ఆందోళన మొదలైన వెంటనే ఆర్జీకర్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజీనామా చేశాడు. ఆ వెంటనే మమతా బెనర్జీ ప్రభుత్వం ఆయనకు వేరే పోస్టింగ్ ఇచ్చి మర్వాద చేసింది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చేవరకూ నిందితుల కోసం దర్వాప్తు సాగలేదు. చివరికి పోలీసులకు సహాయకుడుగా, డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న సంజరురాయ్ ప్రధాన నేరస్తుడిగా అరెస్టు చేశారు. కానీ నేరస్తుడు ఒక్కడు మాత్రమే కాదు. ఆ ట్రెయినీ డాక్టరమ్మ అత్యాచారం, హత్య విధానం, దాని నివేదిక ప్రకారం, వీడితో పాటు మరికొంతమంది ఉంటారనేది ఎవరైనా చెప్పగలిగిన విషయం! మరెందుకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తాత్సార్యం చేస్తున్నది? ఎట్టకేలకు సి.బి.ఐ.కి కేసును అప్పజెప్పారు. ఆసుపత్రి కళాశాల యాజమాన్యం, హత్య జరిగిన సెమినార్ హాల్ పక్కనే బిల్డింగ్ గదులను కూల్చి రిపేరు పని మొదలెట్టడం ఏమిటి? సాక్ష్యాలు దొరక్కుండా పోవడానికా! ఘటనపై పోలీసుల నిర్లక్ష్యానికి, అమానుష చర్యకు వ్యతిరేకంగా బెంగాల్‌లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కలకత్తా నిరసనలలో కొందరు దుండగులు చేరి ఆసు పత్రిలో విధ్వంసం సృష్టించారు. హైకోర్టు కూడా రాష్ట్ర సర్కారును ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారని సీపీఐ(ఎం)పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్ విమర్శించారు. ముమ్మాటికీ ఇది టి.ఎం.సీ. గుండాల బరితెగింపని వ్యాఖ్యానించారు. ప్రధాన నిందితుడు సంజరురారు, ‘చంపితే నన్ను చంపేయండి’ అని ఏ మాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రకటించాడు.
బీజేపీ వారు దీన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్నావ్ సంఘటనలో నేరస్తుల పక్షం వహించినవారు, హత్రాస్ ఘటనలో పాలకులే దుర్మార్గులకు వంత పాడారు. కతువాలో రేపిస్టులను కాపాడే ప్రయత్నాన్ని సాగించి బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణలు స్వయంగా అమ్మాయిలే చేసినా స్పందించనివారు, తిరిగి అతని పుత్రరత్నాన్నే ఎన్నికల్లో నిలబెట్టారు. డేరాబాబాకు బెయిలిప్పించిన వారు రాజకీయం తప్ప, దుర్మార్గాలను అడ్డుకోవడం వారినైజం కాదు.
కలకత్తా ఘటన దేశం మొత్తాన్ని కదిలిస్తోంది. దేశమే కాదు, విదేశంలో నిరసనలు వెల్లువెత్తు తున్నాయి. రేప్‌లు జరిగితే వస్త్రధారణ, రాత్రుళ్లు తిరగడం మీద వ్యాఖ్యానించే చ్చు పుచ్చు సనాతనులమని చెప్పుకునే వారు, ఇప్పుడీ ఘటనకు కారణమేమి చెబుతారో! ఇప్పటికైనా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో న్యాయం చేసేందుకు పూనుకోవాలి.