చిట్యాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని రైతుల ధాన్యాన్ని గురువారం రోజున సిపిఎం రైతు సంఘ ప్రతినిధుల బృందం పరిశీలించి, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బొంతల చంద్రారెడ్డి, బండ శ్రీశైలం స్థానిక నాయకులు జిట్టా నగేష్, అవిశెట్టి శంకరయ్య, ఆరూరి శ్రీనివాస్, శీలా రాజయ్య తదితరులు పాల్గొన్నారు