
తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన బి ఓంకార్ యాదవ్ ను తాడ్వాయి ప్రెస్ క్లబ్ ప్రతినిధులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో మండల భౌగోళిక పరిస్థితులు, శాంతి భద్రతలు మాట మంతి నిర్వహించారు. కలిసిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తిరువాయిముడి పురుషోత్తం, మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు తమ్మల సమ్మయ్య గౌడ్, కోగిల సారయ్య, చింతల సంపత్, చింతల దేవేందర్, బండారి లక్ష్మయ్య, కోట రమేష్ తదితరులు పాల్గొన్నారు.