మండల కేంద్రంలోని మానసిక వికలాంగుల పాఠశాలలో రవీందర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. మండల కేంద్రంలోని ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శుభోదయం పాఠశాల లోపల మానసిక వికలాంగుల విద్యార్థుల మధ్య 76 గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు పాటలు పాడించి తగిన బహుమతులను అందజేస్తారు .అనంతరం స్వీట్లు అందించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సమక్ష అధ్యక్షురాలు, కమ్యూనిటీ కోఆర్డినేటర్, మండల సమైక్య సిబ్బంది, వివోఏలు శుభోదయం పాఠశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.