మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయము మరియు జూనియర్ కళాశాలలో 76 వ గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రిన్సిపాల్ నందాల గంగాకిశోర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అన్ని తరగతుల విద్యార్థులు పేరెడ్ గౌరవ వందనమును సమర్పించారు. ప్రముఖ పద్యకవి, సంస్కృతోపన్యాసకలు బి. వెంకట్ చేసిన వ్యాఖ్యానము సభను అలరించింది. విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి పిరమిడ్లు, యోగాసనాలు, మార్చ్ పాస్టు, నాటికలు, నృత్యాలు, పాటలు, సభను ఆకట్టుకొన్నాయి. ఈ వేడుక కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు – జే గణేశ్, సంతోష్, బి.వెంకట్, వేణుగోపాల్, నరహరి, సమీరా, రాము, గోవింద్, గంగాప్రసాద్, విద్యా ర్థులు పాల్గొన్నారు.