మద్నూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో భాగంగా కార్యాలయ ఆవరణంలో జాతీయ పతాకాన్ని మండల ప్రత్యేక అధికారి బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజ్ ఎగరవేశారు. ఈ వేడుకల్లో ఎంపీడీవో రాణి ఎంపీ ఓ వెంకట నరసయ్య కార్యాలయా సీనియర్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ వీరితోపాటు ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ ఏపిఎం రవీందర్ వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.