– రైతుల కోసమే మార్కెట్ కమిటీ చైర్మన్
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా కార్యాలయం ఎదుట జాతీయ పతాకాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సౌజన్య రమేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ రైతుల కోసమేనని రైతుల అవసరాల కోసం మార్కెట్ కమిటీ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులు కార్యాలయ సూపర్వైజర్లు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.