నవతెలంగాణ – మద్నూర్
దేశవ్యాప్తంగా జరుపుకున్న 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు నిర్వహించగా గాంధీ చౌక్ లో గ్రామ కార్యదర్శి సందీప్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఈ వేడుకల్లో గ్రామ పెద్దలు వివిధ పార్టీల నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.