గణతంత్ర దినోత్సవ వేడుకలు

గణతంత్ర దినోత్సవ వేడుకలుఎస్పీడీసీఎల్‌లో…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లోని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణి సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ముషారఫ్‌ ఫరూఖీ జాతీయ జెండా ఎగురవేసి, ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటూ విద్యుత్‌ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేయాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్‌లు టీ శ్రీనివాస్‌, జే శ్రీనివాసరెడ్డి, కే రాములు, జీ పర్వతం, సీహెచ్‌ మదన్‌మోహన్‌ రావు, ఎస్‌ స్వామిరెడ్డి, జీ గోపాల్‌, సీవీఓ శ్యామ్‌బాబు తదితరులు పాల్గొన్నారు
ఎన్పీడీసీఎల్‌లో…
తెలంగాణ రాష్ట్ర ఉత్తర ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) ప్రధాన కార్యాలయం హన్మకొండ విద్యుత్‌ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సంస్థ చైర్మెన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కొల్పోయిన విద్యుత్‌ ఉద్యోగుల అమరుల స్థూపం వద్ద పూలదండ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ నష్టాలను అధిగమించాలంటే సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించిన 44 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందచేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు బీ వెంకటేశ్వరరావు, గణపతి, సంధ్యారాణి, పీ మోహన్‌రెడ్డి, ఇంఛార్జ్‌ డైరెక్టర్‌(ఫైనాన్స్‌) వీ తిరుపతిరెడ్డి, చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్‌ బీ జనార్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సమ్మేళనం..

భట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ పెడన, ఎస్‌ఎస్‌సీ 1975-76 బ్యాచ్‌ విద్యార్థినీ, విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు శుక్రకారం తమ ఆత్మీయ సమ్మేళనాన్ని హైదరాబాదులోని వాసవి శ్రీనిలయం, ఎల్బీ నగర్‌లో ఆనంద ఉత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన హీరో మరియు ఈ బ్యాచ్‌ విద్యార్థి కెఎస్‌ఎన్‌ మూర్తి కుమారుడు అయిన చేతన్‌ శ్రీను పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాంస్కతిక కార్యక్రమంలో భాగంగా కుమారి నక్షత్ర కూచిపూడి నత్యం చేసి ప్రేక్షకులను అలరించారు. మొదటగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వీరు తమ తమ స్కూలు అనుభవాలను, వారికి విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులను స్మరించుకుంటూ, ఆరోగ్య చిట్కాలు వివరించు కుంటూ, కొంతమంది పాటలతో ఆద్యంతం ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. ఓటాఫ్‌ థాంక్స్‌తో ఈ కార్యక్రమాన్ని బొడ్డు రామమూర్తి ముగించారు. కార్యక్రమానికి గుత్తి తిరుపతి రావు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. దక్షిణా మూర్తి, శివ కుమార్‌, మోతుమర్రి శ్రీనివాస్‌,ఉదరు శంకర్‌ ల నేతత్వంలో జరిగిన ఈ కార్యక్రమం అందర్నీ అలరించింది. మళ్లీ మళ్లీ ఇలాంటి తమ కార్యక్రమాలను మరెన్నో జరుపుకోవాలని ముక్త కంఠంతో అందరూ ఆకాంక్షను వ్యక్తం చేశారు.