
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం పట్టణంలోని పెర్కిట్ చౌరస్తాలో అసెంబ్లీ కన్వీనర్ పాలెపు రాజు ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు మందుల బాలు,నెహ్రు యువ కేంద్ర జిల్లా అడ్వైజర్ కమిటీ మెంబర్ గుగులోత్ తిరుపతి నాయక్,, సీనియర్ నాయకులు దుగ్గి విజయ్ ,బీజేవైఎం నాయకులు పసుపుల సాయి, వాసు ఏబీవీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని 18 వ వార్డులో..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 18 వ వార్డు జర్నలిస్ట్ కాలనీ (కెనాల్ కట్ట) కాలనీవాసులు గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి 18 వ వార్డు ఇంచార్జ్ గుగులోత్ శిరీష తిరుపతి నాయక్ హాజరై జాతీయ జండా ఎగురవేసినారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు బాజమ్మ, సోనీ, భూత అధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు..
పలు పాఠశాలల్లో…
పలు పాఠశాలల్లో…
పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో, పెర్కిట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, పట్టణ పరిధిలోని మామిడిపల్లి హై స్కూల్ తపస్వి స్వచ్ఛంద సంస్థ ఎందు గణతంత్ర దినోత్సవ సంబరాలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, శ్రీనివాస్, రవీందర్, తపస్వి యందు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.