మండల వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు నిర్వహించారు. శుక్రవారం 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులు, మార్కెట్, పిఏసీఎస్ చైర్మన్లు, గ్రామలల్లో సర్పంచ్లు, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, యువజన సంఘాలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.