
పరకాల పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టెక్నో స్కూల్ లో శుక్రవారం రోజున గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బిట్స్ ఎడ్యుకేషనల్ సోసైటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ రెడ్డి గారు హాజరై విద్యార్థిలకు రిపబ్లిక్ డే యొక్క ప్రాముఖ్యతను , స్వతంత్ర సమరయోధుల త్యాగాలను విద్యార్థులకు చక్కగా వివరించారు. దేశాన్ని బంగారు పదంలో నడవటానికి విద్యార్థులు యొక్క కృషి ఎంతో ఉంటుందని తెలియజేశారు. విద్యార్థులు స్వతంత్ర సమరయోధుల వేషధారణలో అలరించారు. స్వతంత్ర సమరయోధుల వేషధారణలలో వచ్చినటువంటి విద్యార్థులకు చైర్మన్ గారు, బిట్స్ ప్రిన్సిపాల్ జోసెఫ్ బహుమతులు ఇచ్చి ప్రోత్సహించారు.విద్యార్థులు దేశభక్తి గీతాలతో, నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.