
76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ రూరల్ మండలంలోని సారంగపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు కే లలిత పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎందరో వీరుల త్యాగఫలం స్వాతంత్ర్యం అని, ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించాడని. రాజ్యాంగం బోధించిన విధంగా హక్కుల కోసం పోరాడుతూ బాధ్యతలు నిర్వహించాలని ఆమె కోరారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు దేశభక్తిని చాటుతూ అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడలు మరియు సాంస్కృతిక పోటీల విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, వెంకటేశ్, నగేశ్, రవి, సాదుల నరసయ్య, మహిపాల్ ఉపాధ్యాయులు డాక్టర్ సల్ల సత్యనారాయణ, రాధాకృష్ణ, గోపాల్, ఘనపురం దేవేందర్, మహమ్మద్ జావిద్, డాక్టర్ ఎస్ గంగాధర్, శ్రీలత, అనిత, స్వరూప, లలిత, సుజాత, రంగు కృష్ణంరాజు, సిహెచ్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో క్రీడాభివృద్ధికి వివేకానంద యూత్ సభ్యులు రూ.10000 విరాళం ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా జాతీయస్థాయి నెట్ బాల్ క్రీడలకు ఎంపికైన పదవ తరగతి విద్యార్థిని రక్షిత, ఇటీవల తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ సాధించిన ఎస్ గంగాధర్ లను ఘనంగా సన్మానించారు.