నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో గల టీఎన్జీవో జిల్లా కార్యాలయం ఆవరణలో, జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ఉద్యోగ మిత్రులకు జిల్లా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలన్నింటినీ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ప్రతి పౌరునికి చేరవేటలో ఉద్యోగులందరూ ప్రముఖ పాత్ర వహిస్తున్నారని అభినందిస్తూ, కొత్తగా వచ్చే పథకాలన్నింటినీ కూడా ప్రజలందరికీ చేరవేస్తూనే ఉద్యోగుల హక్కుల సాధన కొరకై పోరాడుటకు ఉద్యోగులందరూ సమాయతo కావాలని కోరారు. అనంతరం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటుచేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు టీఎన్జీవోస్ పక్షాన ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉద్యోగి అవార్డు పొందిన వివిధ శాఖల ఉద్యోగులందరినీ అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, జిల్లా సహాధ్యక్షులు పెద్దోళ్ళ నాగరాజు, చిట్టి నారాయణరెడ్డి, టీఎన్జీవో కేంద్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, కోశాధికారి దినేష్ బాబు, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి,జిల్లా కార్యవర్గ సభ్యులు, అతిక్, జాఫర్ హుస్సేన్, ఇందిర, రాజేశ్వర్, ఉమా కిరణ్, భూమన్న, విజయలక్ష్మి ,సునీల్, వివిధ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు.