గొల్లపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..

Grand Republic Day celebrations in Gollapally..నవతెలంగాణ – కంఠేశ్వర్ 
గొల్లపల్లి గ్రామంలో మండల ప్రాథమిక పాఠశాలలో ఆదివారం 76 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించామని ప్రధానోపాధ్యాయురాలు వనిత తెలిపారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించేందుకు గ్రామానికి చెందిన యువకులు విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు ఉపాధ్యాయులు సంతోష్ పద్మావతి, విద్యార్థులు పాల్గొన్నారు.