హుస్నాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు

నవతెలంగాణ – హుస్నాబాద్  రూరల్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఐ.ఓ.సీ కార్యాలయం వద్ద హుస్నాబాద్ లో ఆర్డిఓ బెన్ శలొమ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్,  ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ
హుస్నాబాద్  కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు గణతంత్ర దినోత్సవ పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, చిత్తారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.