76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జన్నారం మండల కేంద్రంలో తో పాటు అన్ని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డి, ఎంపీడీవో శశికళ, ఎస్ఐ రాజ వర్ధన్, ఇందన్ పెళ్లి ఎఫ్ఆర్ఓ కార్యాలయంలో ఎఫ్ ఆర్ ఓ కారం శ్రీనివాస్, జన్నారం ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ సుష్మారావు, ఎంఈఓ విజయ్ కుమార్, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమా శ్రీ, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో సంగీత ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చిలువేరు నరసయ్య, మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్, మాల మానాడు మండల అధ్యక్షుడు దాముఖ కరుణాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముజాఫర్ అలీ ఖాన్, బిజెపి మండల అధ్యక్షుడు గుండవరపు మధుసూదన్ రావు, అన్ని కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ అధికారులు ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మిఠాయిలు పంచుకొని 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.