నవతెలంగాణ – బాల్కొండ: మండల కేంద్రంలోని శాంభవి హై స్కూల్ లో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థిని విద్యార్థులు గ్రామంలో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఫౌండర్ బొట్ల విజయలక్ష్మి జాతీయ జెండా ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ బొట్ల మధుసూదన్, కరస్పాండెంట్ బోట్ల రవీణ్ ప్రసాద్ , ప్రిన్సిపాల్ ఇంద్రాణి, వైస్ ప్రిన్సిపాల్ మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.