76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకోని నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటి ఫర్ రూరల్ రికన్ స్ట్రక్షన్ ఆద్వర నిర్వహించబడుతున్న వివిధ ప్రాజెక్టులలో జాతీయ పతకాన్ని ఎగరవేసి గణతంత్ర దినిత్సవ వేడుకలను ఘనంగా ఆదివారం నిర్వహించారు.వీక్లీ మార్కెట్లో గల హెచ్ఐవి ఎయిడ్స్ నివారన కార్యాలయంలో, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని సఖి కేంద్రం, మారుతి నగర్ లో గల మానసిక వికలాంగుల పాఠశాల,గిరిరాజ్ కళాశాల ఎదురుగా ఉన్న జిల్లా అంధుల వనరుల కేంద్రంలో, స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు సిబ్బందికి బహుమతులను అందించారు. 2025ని స్నేహ సొసైటీ క్యాలెండర్ను అద్యక్షుడు డా|| మహిపాల్, కార్యదర్శి యస్. సిద్దయ్య, కార్యవర్గ సభ్యులు యస్. దయనంద్, జి.సుధాకర్, రమణరెడ్డి, ప్రిన్సిపాల్ యస్. జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, లోకల్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ బాబాగౌడ్, వైస్ చైర్మన్ జీవన్ రావ్, ప్రకాశరావ్, కృష్ణారావులు విడుదల చేశారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.