సుందరయ్య నగర్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని వసర గ్రామం సుందరయ్య నగర్ లో సీపీఎం ఆధ్వర్యంలో 75వ గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బీ రెడ్డి సాంబశివ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కమిటీ సభ్యులు పొదిళ్ల చిట్టిబాబు ,  గొంది రాజేష్,ఐద్వ జిల్లా కార్యదర్శి కారం రజిత,మండల సభ్యులు సోమ మల్లారెడ్డి, అంబాల మురళి, పసర సిపిఎం పార్టీ కార్యదర్శి కడారి నాగరాజ, గ్రామ కమిటీ సభ్యులు అంబాల పోషాలు, జుట్టబోయిన రమేష్, పల్లపు రాజు,ముమ్మడి ఉపేంద్ర చారి, సప్పిడి ఆది రెడ్డి, గరువు ఐలయ్య , మంచోజు బ్రహ్మచారి, డివైఎఫ్ఐ  పిట్టల అరుణ్ ,అలాగే సుందరయ్య నగరు వాసులందరూ పాల్గొన్నారు.