ఉప్పునుంతల మండల పరిధిలోని వెల్టూర్ గ్రామంలో ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు.గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట పంచాయితీ కార్యదర్శి ఉమాశంకర్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ రెడ్డిరెడ్డి సుగుణమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ప్రతి భారతీయుడు పవిత్ర గ్రంథంగా భావించే భారత రాజ్యంగం అమలు లోకి వచ్చిన శుభ దినం కావున ప్రజాస్వామ్యం కల్గిన భారత దేశంలో సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం ఏర్పాటుకు కృషి చేసి భారత రాజ్యాంగాన్ని పొందుపర్చిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ అని కొనియాడుతూ ప్రతిఒక్కరు రాజ్యంగంలో పొందుపర్చిన అంశాలను పాటిస్తూ ముందుకుపోవాలని కోరుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీను, ఎంపిటిసి రంగారెడ్డి, వార్డు మెంబర్లు లింగమయ్య యాదవ్, నరేష్ యాదవ్, ఫీల్డ్ అసిస్టెంట్ దేవేందర్, ప్రధానోపాధ్యాయుడు రవి కుమార్ మరియు నాయకులు లింగమయ్య. గుద్దటి బాలరాజు. ఉప్పరి బాలరాజు, ప్రహ్లాద్, జంగారవు శ్రీను, సయ్యద్, లక్ష్మమ్మ, లాలూ గౌడ్, నాగార్జున, సైదులు, జనార్ధన్, శ్రీశైలం, నర్సింహా రావు, తదితరులు పాల్గొన్నారు.