బీజేపీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – ముత్తారం

మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు పెయ్యాల కుమార్ జెండా ఎగరవేసి జాతీయ గీతం ఆలపించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.