పాఠశాలకు గణతంత్ర దినోత్సవ కానుక

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండల కేంద్రంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా రాజస్వ ప్రధానోపాధ్యాయులు జటప్రోల్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ కట్టా సరితాఅనంతా రెడ్డి పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశమిచ్చారు.అనంతరం గత మూడు రోజులుగా జరిగిన క్రీడల్లో గెలిచిన విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా 1991-92 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్ధులు నామని తిరుపతయ్య, సునీత,పరమేశ్వర్ రెడ్డి, కిషన్, బుచ్చిరెడ్డి పాఠశాలకు ప్రింటర్ ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పుర ప్రముఖులు,విద్యాభిమానులు, విద్యార్ధులు, పంచాయతీ కార్యదర్శి, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.