గణతంత్ర దినోత్సవం.. క్రమ జీవన మంత్రం కావాలి

Republic Day.. We need a regular life mantraనవతెలంగాణ  – ఆర్మూర్ 

స్వతంత్రం సాధించుకున్న తర్వాత భిన్న సంస్కృతులు, సాంప్రదాయాల కలయికగా ఉన్న దేశం ఒకే తాటిపై నడిపించేందుకు రాసిందే రాజ్యాంగం. అది అమలులోకి వచ్చిన సందర్భంగా ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. రాజ్యాంగం దేశ పౌరుడికి కల్పించిన హక్కులను, దేశ  ఔనిత్యాన్ని ఇముడింపని చేయడంలో ఎంత మేరకు సమర్థంగా వినియోగించుకుంటున్నాం? నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నవతెలంగాణ కథనం..
క్రమపరచుకొని ముందుకు సాగాలి..
పరిస్థితులకు అనుకూలంగా రాజ్యాంగ సవరణ చేసినట్లే రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో వ్యక్తిగా వైకల్యం చెందితే జీవన విధానాన్ని క్రమపరచుకొని ముందుకు సాగాలి. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో వ్యక్తిగా వైఫల్యం చెందితే జీవన విధానాన్ని క్రమపరచుకొని ముందుకు సాగాలి. ఈ నేపథ్యంలో రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటున్నామే పరిశీలిద్దాం.
స్వేచ్ఛ…
వందల సంవత్సరాల బానిసత్వం నుంచి విముక్తి పొందాక దేశ పౌరులకు లభించిన మొదటి హక్కు ఇది. కానీ సాంకేతిక వనరులు వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాయి అన్న అపవాదు ఉంది. ఎదుటివారి జీవనాన్ని నియంత్రించడం.. దెబ్బతీసే ప్రతిదీ హరించడం కిందకే వస్తుంది. మనం ఎలా స్వేచ్ఛగా ప్రైవసీతో బతకాలని ఆశిస్తున్నామో,  ఎదుటివారికి అదే ఆలోచనలు ఉండాలని గమనించాలి. ఒక స్వేచ్ఛను హరించే విధంగా ప్రవర్తించరాదు.. అతివేగంగా ప్రయాణించి ఎదుటివారి జీవితం బలి చేయడము.. ఇతరుల స్వేచ్ఛను హరించడమే అవుతుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కావచ్చు. పలు రకాల చట్ట వ్యతిరేక కార్యకలాపాలను కావచ్చు.  జిల్లాలో కొన్ని నేరాలు గత కొన్ని సంవత్సరాలవి. 2021లో 466, 2022  సంవత్సరం 489,  2023 లో 666 నమోదైనవి.
సమానత్వం… కుల బహిష్కరణలు…
స్త్రీ, పురుషులు, కులం మతం జాతి వంటి విభేదాలు లేకుండా పౌరులంతా తమ హక్కులు వనరులను సద్వినియోగం చేసుకోవడమే రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యం. కానీ ప్రస్తుత ఆధునిక యుగంలోనూ లింగ వివక్ష కనిపిస్తుంది. ఆ తర్వాత స్థానంలో కుల సంఘ బహిష్కరణలు ఉన్నవి. గర్భంలో ఆడపిల్ల అని తెలిస్తే చాలు కడుపులోనే చిదిమేసే ఘటనలు మొదలు… సమాన అవకాశాల కోసం బయటకు వస్తే లైంగిక వేధింపులు ఎదురవుతున్నవి. ఇక విద్యలోనూ బాలికలను సర్కారు బడికి, బాలురను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించి దుస్థితి ఉంది. కుటుంబాలకు కుల సంఘ బహిష్కరణల శిక్షలు అమలు చేస్తున్న ఘటనలు వివాదాస్పదమవుతున్నవి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తమ జీవన విధానం కొనసాగిస్తే శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. కానీ ఆ అధికారాన్ని అనధికారికంగా తమ చేతుల్లోకి తీసుకొని సమానత్వ భావనకు విఘాతం కల్పించటం శోచనీయం. లింగ వివక్ష లేకుండా అవకాశం కల్పిస్తే  ఏ లా రాణిస్తున్నారు అన్నందుకు ఉదాహరణ జిల్లాకు చెందిన బాక్సర్లు  హూ సా ముద్దీన్, నికిత్ జరీనాలె నిదర్శనం.
భిన్నత్వంలో ఏకత్వం…
భిన్నత్వంలో ఏకత్వం మన నినాదం అయితే భిన్న సంస్కృతులు సప్రదాయాలు ఉన్న భారతీయులం  అనే భావనతో జీవిస్తున్నాం. ఈ భావనకు చదువు పునాది వేస్తుంది ఏ మధ్యమంలో చదివిన జ్ఞానాన్ని సమపార్జించుకుంటున్నాం. దాదాపుగా అంతా ఒకే విధమైన జ్ఞానం ఉన్న దానిని వినూత్నంగా వినియోగించుకొని,  భిన్నంగా దేశ అవసరాలు తీర్చే సాంకేతికతలు రూపొందించడంలో రాణిస్తున్నారు. ఆంగ్లం మాతృభాష మాధ్మాలు అనే భావన పోయి భాషలు వేరైనా భావం విద్య ఒకటేనన్న విషయం తెలుసుకోవాలి. అన్ని భాషలలోనూ లభించేది ఏకరూప విషయ పరిజ్ఞానమే అన్నది మర్చిపోవద్దు. ఉమ్మడి జిల్లాలో 2252 విద్యాలయాలు ఉండగా నాలుగు లక్షల వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
సామరస్యం..
కారణం ఏదైనా సమాజంలో నేరం జరగరాదు. ప్రతి ఒక్కరు శాంతి సామరస్యంగా జీవించాలి. కానీ కుటుంబం నుంచి జాతీయస్థాయి వరకు విభేదాలతో మొదలవుతున్న కలహాలు అశాంతికి కారణం అవుతున్నవి. కుటుంబ సభ్యుల మధ్య సత్సంబంధాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి. కుటుంబంలోనే శాంతి భావన మొదలవ్వాలి అదే జాతీయస్థాయి వరకు కొనసాగుతుంది. ఇటీవల చిన్న చిన్న విషయాలు వివాదాస్పదమవుతుంది చిన్న విషయానికే  బల మరణాలు లేదా పరస్పర దాడులు హత్యలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి అశాంతి పోవాలంటే రాజ్యాంగం నిర్దేశించిన ఆదేశిక సూత్రాలు తప్పకుండా పాటించాలి. దొంగతనాలు, మోసాలు, అత్యాచారాలు, కుల మత ఘర్షణలు వంటి నేరాలు ప్రజల జీవనానికి ప్రతిబంధకంగా మారుతున్నవి.. ఉమ్మడి జిల్లాల్లో గత కొన్ని సంవత్సరాల నుండి ఆస్తి తగాదాలు, ఇతరత్రా నేరాలు రోజురోజుకు పెరుగుతున్నవి.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం:  పాలెపు రాజు, బిజెపి అసెంబ్లీ కన్వీనర్, ఆర్మూర్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య  రాజ్యాంగం మనది. రాజ్యాంగాన్ని గౌరవించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించినారు. అత్యున్నత రాజ్యాంగం మన దేశానిదే.
నిజమైన గణతంత్ర దినోత్సవం: కుతాడి ఎల్లయ్య, సీపీఐ(ఎం) నాయకులు, ఆర్మూర్
రాజ్యాంగం ద్వారా సంక్రమించిన సమానత్వం, న్యాయం, సర్వభౌమాధికారం, ప్రజాస్వామ్య విలువలు, వయోజన ఓటు హక్కు ప్రజలందరికీ లభించినప్పుడే నిజమైన గణతంత్ర దినోత్సవం.