నూతన సబ్ స్టేషన్ లు మంజూరు కొరకు వినతి..

Request for sanction of new sub stations..– ఉప ముఖ్యమంత్రిని కలిసిన ప్రభుత్వ విప్..
నవతెలంగాణ – వేములవాడ 
వేములవాడ నియోజకవర్గలోని పలు మండలాల్లో నూతన సబ్ స్టేషన్ లు మంజూరి కొరకు, సబ్ స్టేషన్ ల అప్ గ్రేడ్ కొరకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ను ఆదివారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విన్నవించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూవేములవాడ రూరల్ అర్బన్ మండలాల పరిధిలోని నూకలమర్రి, రుద్రవరం గ్రామాల్లో నూతన 33/11  కె.వి నూతన సబ్ స్టేషన్ లను మంజూరు చేయవలసిందిగా విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క ని కోరడం జరిగిందని అన్నారు.అలాగే రుద్రంగి మండల కేంద్రంలోని 33/11కె.వి నెరేళ్ళ లోని 33/11కె.వి  చందుర్తి మండలం జోగాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్  వద్ద గల సబ్ స్టేషన్ లను 132/33  కె.విసబ్ స్టేషన్ లుగా అప్ గ్రేడ్ చేయవలసిందిగా కోరారు. లో వోల్టేజ్ ,ఓవర్ లోడ్ కారణంగా రైతులు ,ప్రజల లకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నూతన సబ్ స్టేషన్ మంజూరు తో పాటు,కొన్ని సబ్ స్టేషన్లను అప్ గ్రేడ్ చేయవలసిందిగా విన్నవించారు. దీనికి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు అని తెలిపారు. త్వరలోనే నూతన సబ్ స్టేషన్ మంజూరు తో పాటు, అప్ గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు అని వెల్లడించారు.