
శంకరపట్నం మండల పరిధిలోని కేశవపట్నం పోలీస్ స్టేషన్, పూర్తి స్థాయిలో శిధిలమై ఉరుస్తున్నదని, 30 సంవత్సరాల క్రితం నిర్మించిన స్టేషన్ శిథిలావస్థకు చేరడం వలన పోలీస్ అధికారులకు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, వెంటనే మరమత్తులు చేయాలని గురువారం జిల్లా కలెక్టర్ పరిపాలన అధికారి సుధాకర్ కు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కని సంజయ్ కుమార్, కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దృష్టికి, ఉన్నత అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు జంగా కొమురయ్య, గరిగే కోటేశ్వర్, అందె శంకర్,తదితరులు పాల్గొన్నారు.