రాంనగర్ ను జిపి చేయాలని కలెక్టర్కు వినతి.. 

నవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ ను నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేయాలని రాంనగర్ కు చెందిన ప్రజలు, నాయకులు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..రాంనగర్ నూతన జిపి ఏర్పాటు పట్ల జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చిన వారిలో కుంట సదాలక్ష్మి- రాజయ్య, 9వ, వార్డు సభ్యులు  కుంట చక్రవర్తి, కాంగ్రెస్ నాయకులు, ఎండి యాసిన్,మామిడి మోహన్, సమ్మెట శ్రీకాంత్, గూడేపు ఓదెలు తదితరులు పాల్గొన్నారు.