నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ రెవెన్యూ సర్వే నెంబర్ 106, 273లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు సోమవారం ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ రెండు నెంబర్లలో ఉన్నటువంటి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు,ధరణి వచ్చినప్పటి నుంచి రెండు సర్వే నెంబర్లు నిషేధిత జాబితాలో ఉండటం అదేవిధంగా జిల్లా సరిహద్దు సమస్య ఫారెస్ట్ సరిహద్దు సమస్యల వల్ల పట్టా కలిగినటువంటి రైతులు చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది.పట్టా కలిగి ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఇనుప కంచె,ఫెన్సింగ్ వేయడం గోతులు తీయడం లాంటివి చేస్తున్నారని కలెక్టర్ కు వివరించారు.రైతులను వాళ్ళ భూమిలోనికి రానివ్వడం లేదని అదేవిధంగా 273 సర్వే నెంబర్ కు సంబంధించి ధరణి పాస్ పుస్తకాలు ఇంతవరకు రాలేదని చాలామంది రైతులు బ్యాంకు రుణాల కోసం,ఇతర అవసరాల కోసం అమ్ముకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడవలసి వస్తుందని తక్షణమే రెవెన్యూ అధికారులు చొరవ చూపి రెండు సర్వే నెంబర్లలలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశరు.వినతి పత్రం ఇచ్చిన వారిలో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు ఉప్పు కృష్ణ,గడగొట్టి మధు యాదవ్ పాల్గొన్నారు